వరదల నష్ట పరిహారం టీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వాలి – షర్మిల

-

ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా టీఆరెఎస్ పార్టీ అకౌంట్ నుంచి వరదల నష్ట పరిహారం అందించాలని వైఎస్ షర్మిల డిమాండ్‌ చేశారు. రామగుండం పట్టణం న్యూ పోరేడు పల్లి కాలని లో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… రామగుండం పట్టణం లో వరదలకు కారణం కేసీఅర్ వైఫల్యమేనని.. అవగాహన లేకుండా ప్రాజెక్ట్ లు కట్టి ఈ పరిస్థితి తెచ్చాడని నిప్పులు చెరిగారు.

వరదలతో సర్వం కోల్పోయారు… నష్టపరిహారం ఇస్తామని మరో మోసం.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు ? అని నిలదీశారు. 10 వేలు కాదు 25 వేలు ఇవ్వాలన్నారు. టీఆరెఎస్ అకౌంట్ లో 860 కోట్లు ఉంది..ప్రతి నెల వడ్డీ 3 కోట్లు వస్తుందని కేసీఅర్ చెప్తున్నాడు… ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా టీఆరెఎస్ పార్టీ అకౌంట్ నుంచి వరదల నష్ట పరిహారం అందించాలని వైఎస్ షర్మిల డిమాండ్‌ చేశారు.

వరదల తో ఎంతో మంది జీవితాలు ఆగం అయ్యాయి… కడెం ప్రాజెక్టు గేట్లు మరమత్తులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహించారు. మూడేళ్లుగా గేట్లు మార్చాలని చెప్తున్న కేసీఅర్ పట్టించుకోలేదు… గేట్లు మేనేజ్ చేసే సిబ్బంది 33 మంది ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version