KCR ఓ బేకార్ ముఖ్యమంత్రి, పెద్ద మోసగాడని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. వరి వేస్తే ఉరేనని రైతుల్ని బెదిరించే ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా? రేట్లు పెరిగి జనం తిప్పలు పడుతుంటే.. ఆర్టీసీ, కరెంట్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి మరింత భారం మోపిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాన్ని ఆదుకుంటాడని అధికారమిస్తే.. ప్రజాధనాన్ని దోచుకుని ఫామ్ హౌజ్లో సేదతీరుతుండు. వచ్చే ఎన్నికల్లో మోసం చేసేందుకు మళ్లీ వస్తాడు. కొత్త పథకాల పేర్లు చెప్పి, నమ్మిస్తాడన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓటుతోనే కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. వైయస్ఆర్ సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకే ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర అని వెల్లడించారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. పెంచని చార్జీ లేదు. రుణమాఫీ, డబుల్ బెడ్ ఇండ్లు, మూడెకరాల భూమి, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అని మోసం చేశాడు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగమని దగా చేశాడు.ఇప్పుడు దళితబంధు అని మోసం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.