Maha Samudram: మ‌హా సముద్రం లేటెస్ట్ బ‌జ్‌.. నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల ! ఎన్ని కోట్లు కొన్నారంటే..

-

Maha Samudram: మొదటి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’తోనే టాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్ట‌ర్‌ అజయ్ భూపతి. తాజాగా మ‌రో విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్న సినిమా మ‌హాస‌ముద్రం. ఇందులో శర్వానంద్, సిద్ధార్ద హీరోలుగా న‌టిస్తున్నారు. రొమాంటిక్, యాక్ష‌న్ థ్రిల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో జగపతి బాబు.. రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్ర‌స్తుతం.. మహా సముద్రం ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
యూట్యూబ్‌లో 6.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నది.దీంతో మూవీపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వ‌చ్చింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 11 కోట్లకు కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ చిత్ర యూనిట్.. చెప్పకే చెప్పకే సాంగ్ మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది. సాగ‌ర‌తీరంలో చిత్రీక‌రిస్తున్న ఈ సాంగ్ విజువ‌ల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అదితిరావు ప్రధానంగా చిత్రీకరించిన ఈ సాంగ్‌లో అందాల తార చీర కట్టులో ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version