శరీర సౌందర్యానికి సెలబ్రిటీలు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అందరికీ తెలిసిందే. శరీరం అందంగా కనిపించడం కోసం అవసరమైతే సర్జరీలు కూడా చేయించుకుంటుంటారు. అది సహజమే. అయితే ఒంటిపై ఉండే పుట్టు మచ్చలను మాత్రం ఏమీ చేయలేం కదా. వాటిని దాచలేం. కానీ ఆ నటి తన ఛాతిపై ఉన్న పుట్టు మచ్చను ఫొటోషాప్ ద్వారా తొలగించింది. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ఆమెను విమర్శిస్తున్నారు.
బిగ్ బాస్ ఫేమ్‌గా నటి షెహనాజ్‌గిల్ ఎంతో పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎప్పటికప్పుడు ఫొటోషూట్లు చేసి వాటిని తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తాజాగా కొన్ని ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోల్లో ఆమె ఛాతిపై ఉండాల్సిన పుట్టు మచ్చ లేదు. దీంతో ఆ పుట్టు మచ్చ ఏమై ఉంటుందనే విషయాన్ని నెటిజన్లు కనిపెట్టారు.
ఫొటోషాప్‌ను ఉపయోగించి షెహనాజ్ కు చెందిన ఫొటోలను ఎడిట్ చేశారని, అందుకనే ఆమె ఛాతిపై ఉండాల్సిన పుట్టు మచ్చ మాయం అయిందని తెలిసింది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అందంగా కనిపించాలని కోరుకోవడం కరెక్టే. కానీ అందుకు మరీ ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు.. అని నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఆమె పాత ఫొటోలు, కొత్త ఫొటోలను చూస్తే ఛాతిపై ఉండాల్సిన పుట్టు మచ్చ మాయం అయిందని ఇట్టే తెలుస్తుంది.