శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. కోల్పోవడానికి ఏమీ లేనప్పుడూ.. ఇక అంతా లభపడటమే అంటూ ఆయన ట్వీట్ చేశారు. జై మహారాష్ట్ర అని కూడా అన్నారు. శివసేన కు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 40 మందిని తనవైపు తిప్పుకున్న షిండే బిజెపి మద్దతుతో ఏకంగా సీఎం పదవిని అలంకరించడం తెలిసిందే. ఇక శివసేనకు పార్టీ చీఫ్ సహా మిగిలినది 15 మందే.
దీంతో షిండే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని శివసేన సుప్రీంకోర్టు ముందు సవాల్ చేసింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ ఇలా ట్వీట్ చేశారు. అయితే శివసేన లో మాట్లాడే స్వరం ఏదైనా ఉందంటే అది సంజయ్ రౌత్ అనే చెప్పుకోవాలి.పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే మాట్లాడడం తక్కువే. అయితే న్యాయపరమైన చర్యలతో షిండే సర్కారును ఇరుకున పెట్టే వ్యూహం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
जब "खोने"के लिए कुछ भी ना बचा हो तो "पाने" के लिए बहुत कुछ होता हैं!.
जय महाराष्ट्र !. pic.twitter.com/BeQNDziC3w— Sanjay Raut (@rautsanjay61) July 8, 2022