ముద్దు పెట్టుకొనేవారికి షాకింగ్ న్యూస్.. భయంకరమైన వ్యాధి వస్తుంది జాగ్రత్త..

-

ముద్దు పేట్టుకోవడం అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు.. అది నిజమే..ప్రేమతో కొందరు ముద్దు పెట్టుకుంటే మరికొంతమంది శృంగారం కోసం ముద్దు పెట్టుకుంటారు.. అయితే కిస్సింగ్ డీసిజ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.. ఈ వ్యాధి భయంకరమైనదని నిపుణులు అంటున్నారు.. అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముద్దు పెట్టుకుంటే వచ్చే ఈ వ్యాధిని ‘ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోస్సిస్’ అని సైన్స్ పరంగా పిలుస్తారు..షార్ట్కట్లో మోనో అంటారు. ఇది ఎప్స్టీన్-బార్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ లాలాజలంలో ఉంటుంది. లాలాజలం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అందుకే లాలాజలం ముద్దు పెట్టుకున్నప్పుడే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఎక్కువ, కాబట్టి దీనికి కిస్సింగ్ డిసీజ్ అని పేరు పెట్టారు. పిల్లల్లో, యువతలో ఇది వచ్చే అవకాశం ఉంది. పిల్లల్ని ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. అందుకే వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే ఒకరు తిన్న ఆహార పదార్థాలు మరొకరు తిన్నా, ఈ ఇన్ఫెక్షన్ ఉన్నా వారి కంచంలో మరొకరు తిన్నా ఈ అంటూ వ్యాధి రావచ్చు. ఇది మొదట సాధారణ జలుబులాగే మొదలవుతుంది..

ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని అంటున్నారు.కానీ కోలుకోవడానికి ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. సరైన వైద్య సంరక్షణ చికిత్స అందించకపోతే మాత్రం ఇన్ఫెక్షన్ ప్రమాదకరమైన సమస్యలుగా మారిపోతుంది. వ్యాధి సోకిన వ్యక్తి కొన్ని వారాలు పాటు తన రోజువారీ కార్యాకలాపాలు చేసుకోలేరు..మాయో క్లినిక్ చెబుతున్న ప్రకారం ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
1. అలసట
2. జ్వరం
3. ట్రాన్సిల్స్ వాపు
4. గొంతు మంట
5. మెడ, చంకల్లో శోషరస గ్రంధుల్లో వాపు
6. తలనొప్పి
7. చర్మంపై దద్దుర్లు రావడం

ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఎవరితోనూ ఆహారాన్ని పంచుకోకూడదు. అలాగే ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. జ్వరం తగ్గి సాధారణ జీవితం గడిపే వరకు వారి వస్తువులు, ఆహారం సెపరేట్గా పెట్టుకోవాలి. వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. కానీ చాలా మంది కనీస జాగ్రత్తలు తీసుకోరు. కుటుంబసభ్యులకు దూరంగా ఉండరు. దీని వల్ల వారికి కూడా సోకే అవకాశం ఉంది. పైన చెప్పిన విధంగా మీకు ఏదైనా మీకు ఉంటే ఒకసారి వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ ముద్దు వ్యాధి బారిన పడిన వారు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ శాతం ద్రవాలు తాగాలి. అలా చేస్తే రెండు నుంచి నాలుగు వారాల్లో కోలుకోవచ్చు. కాకపోతే తీవ్ర అలసటగా ఉంటుంది.. విశ్రాంతి తీసుకుంటు మందులు వాడితే సరిపోతుంది..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version