షాకింగ్ అప్డేట్: ఒకే రోజు ప్రభాస్ “సలార్” , షారుఖ్ “జవాన్” టీజర్ లు రిలీజ్..

-

కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న చిత్రం సలార్.. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదాలు పడుతూనే ఉంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సలార్ మూవీ టీజర్ ను రిలీజ్ చేయడానికి చిత్రబృందం ముహుర్తాన్ని ఖరారు చేసిందట. అన్ని కుదిరితే జులై 7వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా అదే రోజున బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారట. దీనితో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ రెండు టీజర్ లలో ప్రభాస్ మూవీకి ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం. కానీ ఈ రెండు టీజర్ లు ఒకే రోజు వస్తే మాత్రమే సోషల్ మీడియా షేక్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కానీ ప్రభాస్ కు ఇటీవల సక్సెస్ అయిన సినిమాలు లేవు.. కానీ షారుఖ్ ఖాన్ మాత్రమే మొన్న పఠాన్ తో సక్సెస్ ను అందుకున్నాడు. మరి చూద్దాం ఏమి జరగనుందో ?

Read more RELATED
Recommended to you

Latest news