World Cup 2023 : వరల్డ్ కప్.. భారత్‌కు భారీ షాక్…గిల్ కు డెంగీ!

-

ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఎల్లుండి ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా తో మ్యాచ్ కు ముందు టీమిండియా కు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగీ తో బాధపడుతున్నట్లు సమాచారం అందుతుంది. అతనికి డెంగ్యూ పాజిటివ్ గా తేలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

Shubman Gill Tests Positive For Dengue, Doubtful For India’s ODI World Cup 2023 Match Against Australia

ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు ఒకరోజు సమయం ఉండటంతో అతడు కోలుకోవడం చాలా ప్రశాంతంగా మారింది. గిల్ కోల్కోకపోతే భారత బ్యాటింగ్ ఆర్డర్ పై ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ గిల్ ఆడకపోతే… రోహిత్ శర్మతో కేల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేయనున్నాడు.

కాగా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇవాళ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా రెండవ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు హైదరాబాద్ వేదిక కానుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version