చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు : సీదిరి అప్పలరాజు

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్ లపై ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని జగన్‌ను ప్రశ్నిస్తున్నారని, కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… వంశధార ప్రాజెక్టు గురించి అడగడం విడ్డూరమన్నారు. చంద్రబాబు రెండుమూడుసార్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏం చేయలేదని, కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంశధార పట్టాలెక్కిందన్నారు.

ప్రాజెక్టులపై ఒడిశాతో ఉన్న సమస్యలపై ఏనాడైనా స్పందించారా? అని బాబును నిలదీశారు. ప్రాజెక్టులపై సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, కానీ చంద్రబాబు కనీసం నిర్వాసితులకు న్యాయం చేయలేదన్నారు. వంశధారపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా, వైఎస్ ప్రారంభించారు, జగన్ పూర్తి చేస్తున్నారనేదే నిజమన్నారు. టీడీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ సిద్దాంతాలను, కార్యకర్తల కష్టాన్ని ప్యాకేజి తీసుకుని అమ్మేసారని పవన్ పై విమర్శలు చేశారు. పవన్ కు జెండా, ఎజెండా లేదు.. చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తావన్నారు. చంద్రబాబు వల్ల పవన్ బాగుపడ్డాడుగాని.. వంద కులాలు నష్ట పోయాయని ఆరోపించారు. చంద్రబాబుకు కట్టు బానిస పవన్ అని మంత్రి సీదిరి అన్నారు. విశాఖను రాజధాని కాకుండా ఇద్దరు నేతలు విషం కక్కుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version