ఇలా మీరు ఆధార్ కార్డ్‌లో ఫోటోని సులభంగా మార్చేయచ్చు..!

-

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎన్నో వాటికి ఆధార్ ప్రూఫ్ గా పని చేస్తుంది ఆధార్ లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి కూడా. ఆధార్ మీద మన ఫోటో తో పాటుగా 12 అంకెలు నెంబర్ కూడా ఉంటుంది UIDAI దీనిని జారీ చేస్తుంది. ఆధార్ కార్డు ని అప్డేట్ చేసే పనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చేస్తుంది.

కొంతమంది ఫోటోని మార్చుకోవాలని అనుకుంటున్నారు మీరు కూడా మీ ఆధార్ కార్డు మీద ఫోటో ని మార్చుకోవాలి అనుకుంటున్నారా… అయితే ఇలా సులభంగా మార్చుకోవచ్చు. కొన్ని సేవలను ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి జూన్ 14 వరకు అవకాశాన్ని ఇచ్చింది ఆ తర్వాత డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఇక ఫోటోని ఎలా సులభంగా మార్చుకోవచ్చు అనే విషయాన్ని చూసేద్దాం…

uidai.gov.in వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ ఫారమ్‌ను ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ నుండి పొందవచ్చు. ఈ ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని అంతా కూడా ఇవ్వండి. ఫారమ్ నింపిన తర్వాత మీ సమీపం లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి సబ్మిట్ చేయండి.
ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి రూ. 100 పే చెయ్యాలి. దానిని సెంటర్‌లో ఫారమ్‌తో పాటు సమర్పించండి.
అలానే మీరు మీ బయోమెట్రిక్ వివరాలను తనిఖీ చేయాలి. ఫోటోను అప్‌డేట్ చేసేందుకు మధ్యలో క్లిక్ చేయాలి. అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ ని ఈ ప్రాసెస్ అయ్యాక ఇస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news