హరీష్ రావును చూసి కేటీఆర్ సిగ్గు తెచ్చుకోవాలి : మహేందర్ రెడ్డి

-

గత ప్రభుత్వం లో ఇసుకను కొల్లగొట్టడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయయి. హరీశ్ రావు రంగనాయక సాగర్ ప్రాజెక్టు క్రింద పంట కాలువలు పూర్తి చేశాడు మీరెందుకు చేయలేదు అని సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి KTR ను ప్రశ్నించారు. 9,10,11 ప్యాకేజి పనులు, కాలువలు మరిచిపోయిండు. హరీష్ రావును చూసి కేటీఆర్ సిగ్గు తెచ్చుకోవాలి. 10 ఏండ్లు మంత్రిగా ఉండి సిరిసిల్లను అన్ని విధాలుగా దోపిడీ చేసిండ్రు. అనుచరులు పూర్తిగా అవినీతి, అక్రమాలు చేశారు. గత ప్రభుత్వంలో పట్టా భూములను కూడా వదలలేదు.

కేసీఆర్ అంటే కాలేశ్వరం కరప్షన్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రాజెక్టుల ప్రభుత్వం. సిరిసిల్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే లక్ష ఇరవై వేల ఎకరాలకు నీరు అందేది. గతంలో మీరు నీరు ఇచ్చిన భూములకు పంట ఎండిపోతే పరిశీలనకు వెళ్లవా. ప్రజలకు సేవచేయడమేనా నీ పని. రెండు రోజుల్లో నీళ్లు వస్తున్నాయని తెలుసుకొని పంటల పరిశీలన చేశాడు. 300 కోట్లు పెడితే సిరిసిల్ల సస్యశ్యామలం అయ్యేది. కాంగ్రెస్ కట్టిన కాలువల ద్వారానే ప్రాజెక్టులకు నీరు వచ్చింది నిజం కాదా. నీ ద్వారా నష్ట పోయిన వారందరికీ ముందు నష్టపరిహారం ఇవ్వు. శ్రీలంక కొలంబో నుండి కేటీఆర్ కు లింక్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలకు పంచిపెట్టిండ్రు. ప్రజలను దోచుకున్న డబ్బులు సిరిసిల్లలో బాధితులకు పంచుతున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు బడుగు, బలహీనవర్గాల వర్గాల అందరినీ బాదపెట్టిండ్రు అని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version