అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు: హరీష్ రావు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు.శుక్రవారం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సన్నాక సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ… హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్‌ను తట్టి లేపాలంటే ఆ పార్టీని ఓడగొట్టాలి అని పిలుపునిచ్చారు.

అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు అని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేసేది ఇలాగేనా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు,నిరుద్యోగులకు 4 వేల భృతి, అమ్మాయిలకు ఉచిత స్కూటీ.. ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగులో ఉన్నాయి. డీఏపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటమీద నిలబడలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version