దేశంలో ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు అభ్యర్థులపై హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రతిసారి అధికార పార్టీకి రాష్ట్రపతి ఎన్నిక నల్లేరుమీద నడుకలా సాగేది. కానీ.. ఈ సారి అధికార పార్టీకి బలం తక్కువగా ఉండటం వల్ల.. విపక్షాలు పుంజుకున్నాయి. అయితే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే బీజేపీ అభ్యర్థిగా ఇటీవల ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ల పేర్లు కూడా తెరపైకి వచ్చినా, ఏమాత్రం అంచనాలకు తావివ్వని రీతిలో బీజేపీ అధినాయకత్వం ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
దేశంలో తొలిసారిగా ఓ ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి బీజేపీ చరిత్ర సృష్టించిందని తెలిపారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే మాటను అక్షరసత్యం చేసి చూపించారని కొనియాడారు సోము వీర్రాజు. అందుకుగాను, ప్రధాని నర్రేంద మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు సోము వీర్రాజు. వ్యవస్థను నడపడంలో అందరి పాత్ర ఉందని బీజేపీ అధినాయకత్వం మరోమారు నిరూపించిందని పేర్కొన్నారు సోము వీర్రాజు. బీజేపీకి మూడు పర్యాయాలు అవకాశం ఇస్తే మొదటిసారి ముస్లింకి, రెండవసారి ఎస్సీకి, మూడవసారి ఎస్టీ మహిళకు అవకాశం కల్పించడం హర్షణీయం అని వివరించారు సోము వీర్రాజు.