వివేకానంద కేసులో కేంద్రం ఎవరినీ కాపాడదన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇవాళ మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… వివేకానంద హత్య కేసులో సిబిఐ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతోందన్నారు. ఈ కేసులో కేంద్రం ఎవరినీ కాపాడదని వివరించారు. వెయ్యి కోట్లు అంటూ ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి… వీటికి చరమగీతం పాడుతామని హెచ్చరించారు.
ఇప్పుడు నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యే లు ఉంటున్నారు… ఎమ్మెల్యేల కుటుంబీకులు అరాచకాలు పాల్పడుతున్నారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కు తిరుపతిలో దొంగ ఓట్లను నమోదు చేయించారన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. బిజెపి ఏపీలో ఎవరికీ ఏజెంట్ గా పనిచేయదు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి విజ యం సాధించి తీరుతుందని తెలిపారు. నాపై మా పార్టీ నేతలు ఎవరూ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదు….అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి నష్టం జరగదన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.