ఐపీఎల్ క‌న్నా ముందుగా సీపీఎల్ టీ20కి సిద్ధం కండి..!

యూఏఈలో సెప్టెంబ‌ర్ 19 నుంచి జ‌ర‌గనున్న ఐపీఎల్ 13వ ఎడిష‌న్ కోసం క్రికెట్ అభిమానులంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అంత‌కు ముందుగానే పొట్టి క్రికెట్ వినోదాన్ని పంచేందుకు మ‌రో లీగ్ సిద్ధ‌మ‌వుతోంది. అదే.. క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌) టీ20. వెస్టిండీస్ వేదిక‌గా ఆగ‌స్టు 18వ తేదీ నుంచి ఈ లీగ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో విదేశీ క్రికెటర్లు కూడా పాల్గొన‌నున్నారు.

be ready for cpl t20

సీపీఎల్ టీ20లో మొత్తం 6 టీంలు ఉన్నాయి. సెమీ ఫైన‌ల్స్ 2, ఫైనల్‌తో క‌లిపి మొత్తం.. 33 మ్యాచ్‌లు జ‌రుగుతాయి. సెప్టెంబ‌ర్ 10వ తేదీన ఫైన‌ల్ జ‌రుగుతుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం, క్వీన్స్ పార్క్ ఓవ‌ల్ మైదానాల్లో అన్ని మ్యాచ్‌లు జ‌రుగుతాయి. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది సీపీఎల్ జ‌రిగిన‌ప్పుడు 6 వ‌ర‌కు స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు. కానీ క‌రోనా నేప‌థ్యంలో కేవ‌లం 2 స్టేడియాల్లోనే ఈ సారి మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

2013వ సంవ‌త్స‌రంలో సీపీఎల్ టీ20 ప్రారంభం కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 7 సార్లు టోర్నీ జ‌రిగింది. ఇది 8వ సారి. ఈ లీగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా ట్రినిడాడ్ జ‌ట్టు టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది. ఆ జ‌ట్టు మొత్తం 3 సార్లు విజేత‌గా నిలిచింది. త‌రువాత జ‌మైకా, బార్బ‌డోస్ జ‌ట్లు త‌లో రెండు సార్లు విజేత‌లుగా నిలిచాయి. ఈ క్ర‌మంలో ఈ సారి జరిగే టోర్నీలో 6 జ‌ట్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి.

ఇక సీపీఎల్ టీ20 ఫుల్ షెడ్యూల్ ఇలా ఉంది..