ఐపీఎల్‌కు మ‌రో ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ దూరం

-

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల మ‌ధ్య జ‌రిగిన యాషెస్ టెస్టు సిరీస్ లో ఇంగ్లాండ్ దారుణ‌మైన ఓట‌మిని చవి చూసిన విష‌యం తెలిసిందే. ఈ ఓట‌మి ప్రభావం ఇంగ్లాండ్ పై చాలానే చూపుతుంది. ఇప్ప‌టి కే ప‌లువురు ఇంగ్లీష్ దిగ్గ‌జ ఆట‌గాళ్లు.. ప్ర‌స్తుత ఇంగ్లాండ్ ఆట‌గాళ్లపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు టెస్టు సిరీస్ ల కంటే టీ 20 ల‌కే ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఇస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

దీంతో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు టీ 20 సిరీస్ ల‌కు కాస్త దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తుంది. అందు లో భాగంగా ఐపీఎల్ టోర్నీ కి దూరంగా ఉండాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టి కే ఇంగ్లాండ్ జ‌ట్టు కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ లీగ్ కు దూరం గా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. తాజా గా ఇంగ్లాండ్ ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్ కూడా ఐపీఎల్ మెగా వేలం కు దూరం గా ఉండ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

 

కాగ బెన్ స్టోక్స్ గ‌త ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన రిటెన్ష‌న్ ప్ర‌క్రియ‌లో బెన్ స్టోక్స్ ను వ‌దిలేసింది. దీంతో బెన్ స్టోక్స్ మెగా వేలానికి అందుబాటు లో ఉండే వాడు. అయితే తాజా గా బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో బెన్ స్టోక్స్ మెగా వేలంలో ఉండలేడు.

Read more RELATED
Recommended to you

Latest news