ఐపీఎల్‌లో పిచ్‌లపై అసంతృప్తి

-

ఐపీఎల్‌లో అంటేనే మ్యాచ్ చివరి బంతికి వరకు నరాలు తెగే ఉత్కంఠ. మ్యాచ్ ఆద్యాంతం కళ్ళు చెదిరే ఫోర్లు, సిక్సర్లు ఈ ఏడాది దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతున్నా ఐపీఎల్‌ మ్యాచ్ లు మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లో ఆరు వేదికలలో మాత్రమే మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ లు చప్పగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదు కాకపోవడంతో అభిమానులకు కూడా తగిన మజా లభించడం లేదు.

దీంతో ఈ చెన్నై పిచ్ పై రాజస్థాన్ ఆటగాడు, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఐపీఎల్‌ జరిగే కొద్దీ పిచ్‌లు మరింత దారుణంగా తయ్యారయ్యాయని ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌ లాంటి టీ 20 లీగ్​లో 160-170 అనేది మినిమమ్ స్కోర్ అని కానీ 130-140 పరుగులు అంటే పిచ్ చెత్తగా ఉందని అర్థం అని పేర్కొన్నాడు.ఐపీఎల్‌ సాగుతున్న కొద్ది పిచ్‌లు ఇంత అద్వాన్నంగా ఉండొద్దని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. చేతి వేలికి గాయమవడంతో స్టోక్స్ ఐపీఎల్‌ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెల్సిందే.

ఈ సీజన్ లో చెన్నై వేదికగా ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు జరగ్గా ఒకే ఒక మ్యాచ్‌లో 200కు పైగా స్కోర్ నమోదైంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పైన కోల్ కతాపై బెంగళూరు 204 పరుగులు చేసింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మూడు సార్లు మాత్రమే చేజింగ్ టీమ్స్ నెగ్గగా… అది కూడా ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు పరిమితం కావడం వల్లే విజయం వరించింది. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమయంలోనూ చెన్నై పిచ్‌లపై విదేశీ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news