2021 ఐపిఎల్… అప్పుడే వేలం మొదలుపెట్టిన బెంగళూరు

ఐపిఎల్ లో బాగా ఇబ్బంది పడే టీం అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది బెంగళూరు టీం. బెంగళూరు ఆటగాళ్ళు సమర్ధవంతులు అయినా సరే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. అయితే ఈ ఏడాది ఐపిఎల్ లో బెంగళూరు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేసినా ప్లే ఆఫ్ లో నిలవలేకపోయింది. దీనితో ఇప్పటి నుంచే వచ్చే ఏడాది ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై దృష్టి సారించింది.

రాజస్థాన్ రాయల్స్ నుండి ఓషనే థామస్, రాజస్థాన్ రాయల్స్ నుండి డేవిడ్ మిల్లెర్, ముంబై ఇండియన్స్‌ కు చెందిన క్రిస్ లిన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. బ్యాటింగ్ విభాగంలో ఎక్కువగా దృష్టి సారించింది. ఈ నేపధ్యంలోనే కీలక ఆటగాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఆర్‌సిబి బ్యాటింగ్ విరాట్ కోహ్లీ, అబ్ డివిలియర్స్‌పై ఎక్కువగా ఆధారపడింది. కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసారు.