బిగ్ బాస్: మోనాల్ ఫేక్.. ఆరియానా ఆటిట్యూడ్.. హౌస్ మొత్తం గరం గరం..

బిగ్ బాస్ లో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ ఆరియానా టార్గెట్ చేసారు. ఒక్క అవినాష్ తప్ప హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆరియాని నామినేట్ చేసారు. కెప్టెన్ షిప్ ని ఎంజాయ్ చెయ్యాలి. ఎంజాయ్ చెయ్యాలి అన్న ఆరియానా, చివరికి ఆ కెప్టెన్ షిప్ కారణంగానే అందరికీ నెగెటివ్ గా మారిపోయింది. అవినాష్ తో తప్ప హౌస్ లో ఉన్న అందరితో ఆమెకి గొడవలు ఉన్నాయి. ఈ కారణంగానే హౌస్ లో ఉండాలని లేదని బయటకి పంపించేయాలని బిగ్ బాస్ ని కోరుకుంది.

అటు పక్క మోనాల్ ని నామినేట్ చేసిన ఆరియానా, ఎనిమిది వారాల నుండి గమనిస్తున్నా కూడా మోనాల్ ఫేక్ గానే కనిపిస్తుందని చెప్పింది. ఇంకా ప్యాకేజీ అని మాట్లాడిన హారికకి గట్టిగా సమాధానం చెప్పింది. హౌస్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులపై ప్యాకేజీ అని మాట్లాడిన హారిక, తన గురించి కూడా మిగతా వాళ్ళు అలా అనుకునే అవకాశం ఉందని ఎందుకు అనుకోలేదో చాలామందికి అర్థం కాని విషయం.

ఏది ఏమైనా ఈ వారం మొత్తం ఆరియానా అందరికీ టార్గెట్ గా మారింది. సోహైల్, ఆరియానా మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నువ్వు కోపం తగ్గించుకో అని ఆరియానా, నువ్వు ఆటిట్యూడ్ తగ్గించుకో అని సోహైల్.. ఇద్దరూ దాదాపుగా పోట్లాడుకున్నారు. మొత్తం నామినేషన్లలో ఆరియానా, హారిక, మోనాల్, అభిజిత్, సోహైల్, మెహబూబ్ ఉన్నారు. మరి వీరందరిలో నుండి హౌస్ నుండి బయటకి వెళ్లేదెవరో చూడాలి.