బ్రేకింగ్: సురేష్ రైనా ఐపిఎల్ కు దూరం కావడానికి కారణం ఇదే…!

-

పంజాబ్ లోని పఠాన్‌ కోట్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా బంధువులపై ఆగస్టు 19 రాత్రి దొంగలు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో రైనాకు చెందిన 58 ఏళ్ల బంధువు ఒకరు మృతి చెందారు. వ్యక్తిగత కారణాలను చూపిస్తూ, సురేష్ రైనా ఐపిఎల్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేసాడు. మృతుడిని అశోక్ కుమార్ అనే ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా గుర్తించారు.

ఆగస్టు 19, 20 తేదీలలో పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్ జిల్లాలోని తరియాల్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “కాలే కచెవాలా” ముఠాలోని ముగ్గురు, నలుగురు సభ్యులు దోపిడీ కోసం వచ్చారని… అశోక్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యులను పఠాన్‌ కోట్‌ లోని మాధోపూర్ సమీపంలోని తరియాల్ గ్రామంలోని వారి ఇంటిపై దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. దాడి సమయంలో, వారు తమ ఇంటి టెర్రస్ మీద పడుకున్నారు. తలకు గాయాలైన అశోక్ కుమార్ మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అందుకే రైనా భారత్ కు తిరిగి వచ్చారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news