ఐపీఎల్: అతడి నుండి అద్భుతాలు ఆశిస్తున్నా.. బ్రెట్ లీ..

-

సెప్టంబరు 19వ తేదీ నుండి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కాబోతుంది. గత సంవత్సరం ఫైనల్ లో పోటీ పడ్డ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో ఐపీఎల్ 13వ సీజన్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే క్రికెట్ సీజన్ దగ్గర పడుతుండగా, ఆటగాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ సీజన్ లో ఆడే ఆటగాళ్ళపై సీనియర్ ఆటగాళ్ళు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ మాట్లాడుతూ, ఈ సారి ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ నుండి అద్భుతాలు ఆశిస్తున్నానని అన్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సంభాషణ జరిపిన బ్రెట్ లీ, ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ఆటగాడు ఎవరని అడిగిన ప్రశ్నకి పై విధంగా బదులిచ్చాడు. ముంబై ఇండియన్స్ ని ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ, అటు నాయకుడిగా తనదైన బాధ్యత నెరవేరుస్తూనే, ఇటు ఓపెనర్ గా పరుగులు రాబట్టడంలో ముందుంటాడని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news