స‌న్ రైజ‌ర్స్ కోచ్ గా డేల్ స్టెయిన్

సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ 2022 కు సిద్ధం అవుతుంది. తాజా గా హైద‌రాబాద్ జ‌ట్టు కోచ్ ల‌ను ఫైన‌ల్ చేసింది. ప్ర‌ధాన కోచ్ గా టీమ్ మూడీ కి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డానికి రంగం సిద్ధం చేసింది. అలాగే బౌలింగ్ కోచ్ గా ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు బౌలింగ్ దిగ్గ‌జం డేల్ స్టెయిన్ కు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నుంది. దీంతో డేల్ స్టెయిన్ ఆట‌గాడి గా కాకుండా కోచ్ గా రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్ఆర్ హెచ్ కు మెంట‌ర్ గా ఉన్న వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్.. ఎన్సీఏ బాధ్య‌తలు తీసుకోవ‌డం తో ఐపీఎల్ కు అందుబాటు లో ఉండ‌డు.

దీంతో ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేసేలా డేల్ స్టెయిన్ ను కోచ్ గా నియ‌మించారు. కాగ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు గ‌త ఐపీల్ లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. దీంతో వ‌చ్చే సీజ‌న్ లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి వ్యూహాల‌ను ర‌చిస్తుంది. ఇప్ప‌టి కే రిటేన్ష‌న్ ప్ర‌క్రియా లో కేన్ విలియ‌మ్ స‌న్, ఉమ్ర‌న్ మాలిక్, అబ్దుల్ స‌మ‌ద్ ల‌ను మాత్ర‌మే అట్టి పెట్టుకుంది. అలాగే ఈ సారి వేలం లో కూడా ఉన్నత స్థాయి ప్లేయ‌ర్స్ కొనుగోలు చేయాల‌ని స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం ప్ర‌య‌త్నం చేస్తుంది.