ఈ నెల 24 న కొత్త ఐపిఎల్ జట్లపై నిర్ణయం…?

భారత్ లో ఎంతో ప్రజాదరణ పొందిన ఐపిఎల్ లో మరో రెండు కొత్త జట్లు చేరే అవకాశం ఉంది అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే రెండు కొత్త జట్లు ఏవి వస్తాయి ఏంటీ అనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపధ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ త్వరలో సమావేశం అవుతుంది. రెండు కొత్త ఐపిఎల్ ఫ్రాంఛైజీలు గురించి డిసెంబర్ 24 న బోర్డ్ వార్షిక సాధారణ సమావేశంలో చర్చిస్తారు.

10-జట్ల ఐపిఎల్‌ గా మార్చడానికి బోర్డ్ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఐసిసి నుంచి అనుమతి అవసరం. అదానీ గ్రూప్ మరియు సంజీవ్ గోయెంకాలు కొత్త జట్లను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్‌ కు చెందిన జట్టు ఒకటి కూడా ఆసక్తి చూపిస్తుంది. కాన్పూర్, లక్నో లేదా పూణే నుండి కూడా పోటీ ఉంది.