పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ ఘ‌న విజ‌యం

అహ్మ‌దాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ 29వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ దుమ్ము లేపింది. ఇంకా 14 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఢిల్లీ అల‌వోక‌గా ఛేదించింది. పంజాబ్‌పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

delhi won against punjab in ipl 2021 29th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌ను కోల్పోయి 166 ప‌రుగులు చేసింది. పంజాబ్ ప్లేయ‌ర్ల‌లో మ‌యాంగ్ అగ‌ర్వాల్ అద్భుతంగా రాణించాడు. 99 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ర‌బాడాకు 3, అవేష్ ఖాన్‌, అక్ష‌ర్ ప‌టేల్‌ల‌కు 1 వికెట్ చొప్పున ద‌క్కాయి.

త‌రువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 17.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌ను కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. శిఖ‌ర్ ధావ‌న్ (69 నాటౌట్), పృథ్వీ షా (39)లు ఢిల్లీ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మెరెడిత్‌, జోర్డాన్‌, హ‌ర్‌ప్రీత్ బ్రార్‌ల‌కు త‌లా 1 వికెట్ చొప్పున ద‌క్కింది.