మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ధోనీని ఐదవ స్థానంలో దిగమంటున్నాడు.. ఎందుకంటే..

-

సెప్టంబర్ 19వ తేదీ నుండి ఐపీఎల్ 13వ సీజన్ మొదలవుతున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. ఐతే అంతా బాగానే ఉంది గానీ చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన మార్పులు ఆటలో ఏ విధంగా ప్రభావం చూపుతాయనేది అందరికీ ఆసక్తిగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి తప్పుకోవడం, కరోనా కారణంగా హర్భజన్ ఆటకి దూరమవడం, మొదలగు అంశాలు చెన్నై జట్టుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో జరిగే మార్పులు ఎలాంటివన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మూడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగే రైనా ప్లేస్ లో ధోనీ లేదా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ దిగనున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐతే ఈ విషయమై మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తనదైన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ, ఓపెనర్లుగా షేన్ వాట్సన్, అంబటి రాయుడు దిగితే బాగుంటుందని అభిప్రాయ పడ్డాడు. గత రెండు సంవత్సరాలుగా షేన్ వాట్సన్ పర్ ఫార్మెన్స్ బాగుంటుంది. అందుకే ఆ స్థానంలో షేన్ వాట్సన్ అయితే సరిగ్గా ఉంటుంది.

ఇంకా మూడవ స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ని పెట్టాడు. రైనా లేని భారాని డుప్లెసిస్ మోయాల్సి ఉంటుంది. ఆ భారాన్ని అతడు సరిగ్గా నెరవేరుస్తాడని, చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతని పట్ల నమ్మకంగా కనిపిస్తుందని చెప్పాడు. నాలుగవ స్థానంలో ధోనీ కేదార్ జాదవ్ మధ్య కన్ఫ్యూజన్ గా ఉందని, వారిద్దరిలో కేదార్ జాదవ్ అయితే బాగుంటుందని తెలిపాడు. ఇంకా ఐదవ స్థానంలో ధోనీని పెట్టాడు. అసలు ధోనీ ఏ స్థానంలో బ్యాటింగ్ కి వెళ్తాడనే కంటే 10, 11వ ఓవర్లు పూర్తయ్యాక ధోనీ బ్యాటింగ్ కి దిగడం బెస్ట్ అని అంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news