ఫాన్స్ కి షాక్, వచ్చే ఐపిఎల్ లో ధోని కెప్టెన్ కాదు…?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు అప్పగించవచ్చని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. 2020 ఐపిఎల్ లో చెన్నై చాలా దారుణంగా ముగించిన సంగతి తెలిసిందే. 14 మ్యాచుల్లో ఆరు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. దీనితో ఆ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో ఇదే మొదటిసారి వారు లీగ్ ప్లేఆఫ్‌ లోకి వెళ్లకపోవడం.

MS-Dhoni-Chennai-Super-Kings-CSK-IPL-2020

ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది అని అప్పుడు స్వేచ్చగా ఆడే అవకాశం ఉందని బంగర్ చెప్పాడు. ధోనీ తల మీద భారం ఎక్కువైంది అని భావిస్తే అతను కెప్టెన్ గా తప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు అని ఆయన పేర్కొన్నాడు. 2011 తర్వాత అతను క్రమంగా కెప్టెన్సీ బాధ్యతలకు కోహ్లీని అలవాటు చేసాడు అని పేర్కొన్నాడు.