ఐపిఎల్ లో ఎవరూ బ్రేక్ చేయలేని ధోనీ రికార్డ్

ఎల్లుండు నుంచి ఐపిఎల్ 2020 సీజన్ మొదలవుతుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగుతాయి. దీనితో అన్ని జట్లు ఇప్పుడు ట్రోఫీ లక్ష్యంగా కష్టపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఐపిఎల్ లో చెన్నై కెప్టెన్ ధోనీ ముందు ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ఒకటి ఉంది. కెప్టెన్ గా 104 విజయాలు ధోనీ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మరియు రైజింగ్ పూణే సూపర్ జెయింట్ రెండింటికి కెప్టెన్‌ గా ధోని వ్యవహరించాడు.

ఈ రెండు టీంలకు ధోనీ 104 విజయాలను అందించాడు. ధోనీ సమీపంలో గౌతమ్ గంభీర్ 71 విజయాలతో ఉన్నాడు. కాని అతను క్రికెట్ ఆడటం మానేశాడు. రోహిత్ శర్మకు 60 విజయాలు ఉన్నాయి, అయితే రోహిత్ ధోని మార్క్ దగ్గరకు రావడానికి 8-9 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ రికార్డ్ ఎవరూ సాధించలేరు అని ధోనీ ఫాన్స్ అంటున్నారు.