IPL 2020పై గంభీర్ జోష్యం.. తొలి మ్యాచ్‌లో ముంబైదే విజయం..!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ మ్యాక్ పై తాజాగా టీంఇండియా మాజీ క్రికెటర్‌ గంభీర్ స్పందించారు.. ఈ సారి జరగబోయే తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ దే పైచేయి అని జోష్యం చెప్పారు. ఈసారి ముంబైలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాల బౌలింగ్‌ చూడడానికి నేను ఎదురుచూస్తున్నా. ఎందుకంటే వీరిద్దరూ ప్రపంచ స్థాయి బౌలర్లు.

టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లు అని గంభీర్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి 3వ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి సురేశ్‌ రైనా లేనందున ఇది చాలా పెద్ద సవాలుగా మారిందన్నాడు. ఇకపోతే ఈ సారి సీజన్ లో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లకు ప్లాన్ చేస్తుండగా.. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.