ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ అండ్ గుడ్ న్యూస్

-

మరో మూడు రోజుల్లో ఐపీఎల్‌ 14వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. అయితే ఐపీఎల్‌ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గర పడుతున్న వేళ బీసీసీఐకి, జట్ల యాజమాన్యాలకు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు, స్టేడియం సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా భారత మాజీ వికెట్‌ కీపర్‌, ముంబై ఇండియన్స్‌ సలహాదారు కిరణ్‌ మోరె సైతం మంగళవారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

కాగా కిరణ్‌ మోరె కరోనా బారిన పడగానే ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే ఆటగాళ్ళతో పాటు ఇతర సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించింది. అయితే ఈ పరీక్షలో మిగిలిన వారికి కరోనా నెగెటివ్ రావడంతో ముంబై జట్టు ఊపిరి పీల్చుకుంది. కాగా ముంబై ఇండియన్స్‌ సలహాదారు కిరణ్‌ మోరె కరోనా బారిన పడడం ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్ కాగా మిలిగిన వారికి నెగెటివ్ రిపోర్ట్ రావడం ఆ జట్టుకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

కాగా ఏప్రిల్ 9వ తేదీ (శుక్రవారం)నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. శనివారం రోజున చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ముంబై వేదికగా పోటీపడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news