పది ఓవర్లు అతడు ఆగితే మ్యాచ్ ఢిల్లీదే… మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా..

ఐపీఎల్ సీజన్ చివరి దశకి వచ్చేసింది. పదమూడవ సీజన్లో ఫైనల్ లో ముంబై తో తలపడేందుకు సన్ రైజర్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల నుండి అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రకారం ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా, సరిగ్గా ఆడితే మ్యాచ్ ఢిల్లీ వశమవుతుందని జోస్యం చెప్పాడు. పృథ్వీ షా పది ఓవర్లు ఆడగలిగినా మ్యాచ్ ఢిల్లీ వైపు వెళ్తుందని తెలిపాడు.

ఈ సీజన్లో పృథ్వీ షా సరిగ్గా పర్ఫార్మ్ చేసింది లేదు. అతడు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం 228 పరుగులు మాత్రమే చేసాడు. మరి అంత తక్కువ స్కోరు చేసినటువంటి ఆటగాడిపై ఆకాష్ చోప్రా అంత నమ్మకం ఎలా పెట్టుకున్నాడనేది అర్థం కావట్లేదు. మరి ఆకాష్ చోప్రా చెప్పినట్టు పృథ్వీ షా రాణించి ఢిల్లీకి విజయం చేకూరుస్తాడా, లేదా సన్ రైజర్స్ చేతిలో ఓటమిని చూస్తారా అనేది చూడాలి.