ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. మ్యాచ్‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

Join Our Community
follow manalokam on social media

కోవిడ్ నేప‌థ్యంలో గ‌తేడాది ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌రిగినా ఈ ఏడాది మాత్రం అనుకున్న తేదీల‌కే ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రేక్షకులు గ‌తేడాది వేస‌విలో ఐపీఎల్‌ను మిస్ అయ్యారు. కానీ ఈసారి మ‌ళ్లీ ఐపీఎల్ వేస‌విలో అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే బీసీసీఐ ఆదివారం ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 6 వేదిక‌ల్లో ఈ సారి మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తాల్లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు.

ipl 2021 full schedule announce these are the dates for matches

గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఇటీవ‌లే పున‌ర్నిర్మించిన న‌రేంద్ర మోదీ స్టేడియంలో ప్లే ఆఫ్స్‌, ఫైన‌ల్ జరుగుతాయి. మే 30వ తేదీన ఐపీఎల్ 2021 ఫైనల్ ఉంటుంది.

కాగా ఈసారి ఐపీఎల్‌లో ఒక్కో టీం లీగ్ ద‌శ‌లో కేవ‌లం 3 సార్లు మాత్ర‌మే ఇత‌ర వేదిక‌ల‌కు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల ప్ర‌యాణ భారం, కోవిడ్ రిస్క్ త‌గ్గుతుంది. అలాగే మొదట కొన్ని రోజుల వ‌ర‌కు ప్రేక్ష‌కులు లేకుండానే మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు. త‌రువాత ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటారు. ఈ మేర‌కు బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

ఇక ఈ సారి ఐపీఎల్ ఏప్రిల్ 9న ప్రారంభ‌మై మే 30వ తేదీన ముగుస్తుంది. కాగా ఐపీఎల్ 2021 ఓపెనింగ్ మ్యాచ్‌ను ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య చెన్నైలో నిర్వ‌హించ‌నున్నారు.

ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది…

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...