ఐపీఎల్ ఆంథెమ్ కాపీ గొడవ.. లీగల్ నోటీసులు.

క్రికెట్ చూడడానికి మొహం వాచిపోయేలా చూస్తున్న అభిమానులకి ఈరోజు నుండి పండగ మొదలవుతుంది. ఐపీఎల్ తో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. దుబాయ్ వేదికగా అబుదాబిలో మొదటి మ్యాచ్ మొదలు కానుంది. ఐతే ప్రతీసారి ఐపీఎల్ పై ప్రత్యేక గీతం రిలీజ్ చేస్తారు. ఈ సారి కూడా అలాంటి ప్రత్యేక పాటని రిలీజ్ చేసారు. హమ్ వాపస్ ఆయేంగే అంటూ సాగిన ఈ పాట ఐపీఎల్ ఆంథెమ్ గా విడుదలైంది. తాజగా ఈ పాట కాపీ అంటూ ఫేమస్ ర్యాప్ సింగర్ క్రిష్ణ కౌల్ ఆరోపణలు చేస్తున్నాడు.

2017లో రిలీజైన దేఖ్ కౌన్ ఆయా వాపస్ పాటని కాపీ చేసి ఐపీఎల్ ఆంథెమ్ కి వాడుకున్నారని క్రిష్ణ కౌల్ అంటున్నాడు. ఐపీఎల్ ఆంథెమ్ వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ చెబితే ఇది నాకు తెలిసిందని, పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆరోపణలు చేస్తున్నానని తెలిపాడు. 14సంవత్సరాల కెరీర్ లో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఐపీఎల్ లాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ విషయమై ఇప్పటికే ఐపీఎల్ టీమ్ కి లీగల్ నోటీసులు పంపాడట. మరి ఐపీఎల్ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.