ఐపీఎల్ తడాఖా.. మొదటి రోజు 20కోట్ల మంది.

కరోనా కారణంగా ఆలస్యంగా మొదలైన ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సామాజిక దూరం మొదలగు కారణాల వల్ల ఈ సారి ఐపీఎల్ ని ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ క్రికెట్ అభిమాని టీవీల్లో చూస్తున్నారు. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం టీవీల్లో వీక్షించే వారికోసం స్టేడియంలో జనాలు లేకపోయినా ఫేక్ అరుపులు, గోలలు, ఈలలు సృష్టిస్తూ, సినిమా చూసేటప్పుడు నేపథ్య సంగీతాన్ని అందించినట్టు మంచి వినోదాన్ని పంచుతుంది.

ఐతే ఈ వినోదాన్ని ఎంతమంది ఆనందించారో లెక్కలని అందరితో పంచుకుంది. ఐపీఎల్ మొదటి మ్యాచుని 20కోట్ల మంది వీక్షించారట. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా కలిసి ఐపీఎల్ చరిత్రలో రికార్డు రేటింగ్ ఇచ్చారు. చెన్నై, ముంబైల మధ్య జరిగిన మ్యాచుకి రికార్డు స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి. ఈ మేరకు ఐపీఎల్ బృందం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసారు. కరోనా కారణంగా ఎలాంటి వినోదం లేని పక్షంలో ఐపీఎల్ ద్వారా క్రికెట్ అభిమానులకి కొంత ఉపశమనం లభించినట్టే అనుకోవచ్చు.