ఐపీఎల్: విలియమ్సన్ పోరాడినా విజయం మాత్రం దక్కలేదు.

-

ఐపీఎల్ లో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ కి ఓటమి తప్పలేదు. 168పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్ళకి సరైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 9పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అప్పుడు కేన్ విలియమ్సన్ ఆట భారాన్నంతా తన మీద వేసుకున్నాడు. కానీ కొద్ది సేపటికే బైర్ స్ట్రో పెవిలియన్ బాట పట్టాడు.

బైర్ స్ట్రో 23పరుగులు (24బంతుల్లో 2ఫోర్లు) చేసాడు. ఆ తర్వాత వచ్చిన ప్రియమ్, గార్గ్, విజయ్ శంకర్ నిలబడలేకపోయారు. ప్రియమ్ గార్గ్ 18బంతుల్లో ఒక ఫోరుతో 16పరుగులు చేయగా, విజయ్ శంకర్ ఏడు బంతుల్లో ఒక సిక్సర్ తో 12పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టుని విజయ తీరాలకి చేర్చే ఒకే ఒక్కడు ఉన్నాడని అనుకుంటుండగా కేన్ విలియమ్సన్ కూడా ఔటయ్యాడు. మొత్తం 39బంతులాడిన విలియమ్సన్ ఏడు ఫోర్లతో 57పరుగులు చేసాడు.

ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ 14పరుగులు చేయగా మిగతా వారు పెద్దగా ఆడలేదు. మొత్తానికి 147పరుగులకి 8వికెట్లు కోల్పోయి విజయాన్ని చెన్నై ఖాతాలో జమచేసారు. చెన్నై బౌలర్లలో కరన్ శర్మ, డ్వేన్ బ్రావో తలా రెండు వికెట్లు, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news