ఐపీఎల్: కోహ్లీకి 12లక్షల జరిమానా..

గురువారం జరిగిన మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘనవిజయం అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ భీభత్సమైన ఇన్నింగ్సుతో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆటగాళ్ళకి ముచ్చెమటలు పట్టించాడు. ఐతే ఈ మ్యాచుపై కోహ్లీకి 12లక్షల జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా 12లక్షకు జరిమానాగా కట్టాలని ఐపీఎల్ కోరింది.

207పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 4పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ ఒక పరుగు చేసి వెనుదిరిగాడు. అటు పక్క ఫీల్డింగ్ లోనూ కోహ్లీ నిరాశ పరిచాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచులని మిస్ చేసాడు. 17వ ఓవర్లో కేఎల్ రాహుల్ వ్యక్తిగత స్కోరు 83పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒకసారి, అలాగే 18వ ఓవర్లో 89పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచు మిస్ చేసాడు. దీంతో కేఎల్ రాహుల్ విజృంభించాడు.