ఐపీఎల్ 2021 షెడ్యూల్‌పై ఫ్రాంచైజీల అసంతృప్తి.. అదే కార‌ణ‌మా..?

-

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఈ సారి కేవ‌లం 6 వేదిక‌ల్లోనే ఐపీఎల్ జ‌రుగుతుంది. కోల్‌క‌తా, బెంగ‌ళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మ‌దాబాద్‌ల‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభ‌మై మే 30వ తేదీన ముగియ‌నుంది. అయితే ఈ షెడ్యూల్‌పై ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలిసింది.

ipl franchises unsatisfied with ipl 2021 schedule

ఈసారి ఐపీఎల్ సంద‌ర్భంగా ఒక్కో టీం 3 సార్ల క‌న్నా ఎక్కువ‌గా ఇత‌ర వేదిక‌ల‌కు ప్రయాణించే అవ‌కాశం లేదు. క‌రోనా వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో త‌ట‌స్థ వేదిక‌ల్లోనే టీంల‌న్నీ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉండ‌దు. అయితే దీనిపైనే ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలిసింది. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ లేక‌పోతే టీమ్‌ల‌కు ఇబ్బందులు క‌లుగుతాయ‌ని ఫ్రాంచైజీలు భావిస్తున్న‌ట్లు తెలిసింది.

ఇక ఢిల్లీ టీమ్‌లో పృథ్వీ షా, అజింక్యా ర‌హానే, శ్రేయాస్ అయ్య‌ర్ వంటి ప్లేయ‌ర్లు ఉన్నారు. వారు ముంబైకి చెందిన వారు. అందువ‌ల్ల వారు ముంబైలో వాంఖెడె స్టేడియంలో ఇత‌ర టీమ్‌ల‌తో ఆడేట‌ప్పుడు వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే పంజాబ్ టీమ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌, మ‌యాంగ్ అగ‌ర్వాల్ లు బెంగ‌ళూరుకు చెందిన‌వారు. అందువ‌ల్ల వారు చిన్న‌స్వామి స్టేడియంలో ఆడితే వారికి అడ్వాంటేజ్ ల‌భిస్తుంది. అక్క‌డి గ్రౌండ్, ఇత‌ర ప‌రిస్థితులు తెలుసు క‌నుక వారి వాటిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కొన్ని టీమ్‌ల‌కు ఈ అడ్వాంటేజ్‌లు ఉండ‌డం ఇత‌ర టీమ్‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. మ‌రోవైపు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ఈసారి ఉండ‌డం లేదు. అందువ‌ల్లే ఫ్రాంచైజీలు బీసీసీఐ నిర్ణ‌యంపై, ఆ షెడ్యూల్‌పై అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలిసింది. అయితే హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఈసారి ఐపీఎల్‌లో ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news