ఐపీఎల్: రాయుడు రాణించినా చెన్నై చతికిల పడింది..

-

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 170పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో చెన్నై చతికిల పడింది. ఓపెనర్లుగా వచ్చిన షేన్ వాట్సన్, డుప్లెసిస్ సరిగ్గా ఆడకపోవడంతో అంబటి రాయుడు భారాన్నంత తనపై ఎత్తుకున్నాడు. అయినా కూడా చెన్నై ఫలితం మారలేదు. 37పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైపై ఘనవిజయం అందుకుంది. అయినా కూడా చెన్నై ఫలితం మారలేదు.

170పరుగుల లక్ష్యంతో దిగిన చెన్నై మొత్తం 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 132పరుగులు మాత్రమే చేయగలిగింది. 37పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైపై ఘనవిజయం అందుకుంది. అంబటి రాయుడు మినహా చెన్నై బ్యాట్స్ మెన్ అందరూ విఫలమయ్యారు. అంబటి రాయుడు 42పరుగులు( 40బంతుల్లో 4ఫోర్లు) చేసాడు. ఆ తర్వాత ఎన్ జగదీషన్ 33పరుగులు( 28బంతుల్లో 4ఫోర్లు) చేసాడు. మిగిలిన వారిలో షేన్ వాట్సన్(14పరుగులు) ఒక్కడిదే అత్యధికం. ధోనీ పది పరుగులు చేసి వెనక్కి తిరిగాడు.

చివరి రెండు ఓవర్లు ఇంకా పూర్తి కాకుండానే విజయం బెంగళూరు చేతిలోకి వచ్చేసింది. ఆ రెండు ఓవర్లలో ఎవరైనా మ్యాచుని మలుపు తిప్పుతారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ రెండు ఓవర్లలో ఏదో ఆడాలి కాబట్టి ఆడాలి అన్నట్టుగా చెన్నై బ్యాట్స్ మెన్ తీరు కనిపించింది. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరిస్ 3వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2వికెట్లు, ఇసురు ఉదాన, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. మొత్తానికి చెన్నై ఖాతాలో ఐదవ పరాజయం చేరగా, బెంగళూరు ఖాతాలో నాలుగవ విజయం చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news