ఐపీఎల్ లో ఆసక్తికరపోరు.. ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూర్ తో కోల్ కతా ఢీ

తుది ఘట్టానికి చేరుకున్న ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న బెంగళూర్, నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఈరోజు జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీతో తలపడనుంది.

షార్జా వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు నెగ్గని బెంగళూర్ టైటిల్ లక్ష్యంగా ఆడనుంది. చాలా రోజుల నుంచి ఊరించుకుంటున్న వస్తున్న ఐపీఎల్ టైటిల్ ను ఈసారైనా దక్కించుకోవాలని చూస్తోంది. మరో వైపు ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన నైట్ రైడర్స్ మరోమారు కప్పు కొట్టాలనే ఆలోచనలో ఉంది. దీంతో ఈరెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు.