ఐపీఎల్ క్వాలిఫైయర్ 2: ఢిల్లీ దూకుడు.. సన్ రైజర్స్ లక్ష్యం 190.

ఐపీఎల్ లో ఈ రోజు జరుగుతున్న క్వాలిఫైయర్ 2 మ్యాచులో ఢిల్లీ కేపిటల్స్, సన్ రైజర్స్ కి భారీ టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కేపిటల్స్ నుండి శిఖర్ ధావన్, స్టాయినిస్, హెట్మెయిర్ విజృంభించడంతో స్కోరు చక చకా పరుగులు పెట్టింది. మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 3వికెట్లు కోల్పోయి 189పరుగులు చేయగలిగింది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఢిల్లీ కేపిటల్స్ ఆటగాళ్ళు విజృంభించారనే చెప్పాలి. ఎనిమిది ఓవర్ల వరకి ఒక్క వికెట్ కూడా పడకపోవడం హైదరాబాద్ బౌలింగ్ పై ఒత్తిడి పెంచింది.

ఢిల్లీ బ్యాట్స్ మెన్ లలో ఓపెనర్లు గా వచ్చిన స్టాయినిస్ 38పరుగులు ( 27బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్సర్) శిఖర్ ధావన్ 78పరుగులు ( 50బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) చేసారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 21పరుగులు( 20బంతుల్లో 1ఫోర్), ఆ తర్వాత వచ్చిన హెట్మెయిర్, 42పరుగులు (22బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్) చేసాడు. చివర్లో వచ్చిన రిషబ్ పంత్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్.. తలా ఒక వికెట్ తీసుకున్నారు.