సన్ రైజర్స్ గెలవడంతో ఆన్ లైన్లో వైరల్ అవుతున్న ఆమె పేరు..

ఐపీఎల్ 14 వ సీజన్లో మొదటి విజయం అందుకున్న సన్ రైజర్స్ చాలా హుషారుగా ఉంది. మొదటి మూడు మ్యాచులు ఓడిపోయి అభిమానులను నిరాశపర్చిన జట్టు, బుధవారం జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్ రైజర్స్ ఓడిపోయిన మూడూ మ్యాచులు కూడా గెలుపుదాకా వచ్చినవే. సునాయాసంగా గెలవగలిగిన మ్యాచులను చేజార్చుకున్నారు. ఐతే మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా స్టేడియంలో ఒకానొక పర్సన్ బాధగా కనిపించారు. వారెవరో కాదు, సన్ రైజర్స్ యజమాని కావ్యా మారన్.

చేతుల్లో ఉన్న మ్యాచులు కూడా ఓడిపోవడంతో ఆమె మొహంలో వర్ణించలేని బాధ కనబడింది. కెమెరా మెన్లు కూడా ఆమెని బాగా ఫోకస్ చేసారు. దాంతో సన్ రైజర్స్ అభిమానులు కనీసం ఆమె కోసమైనా మ్యాచ్ గెలవండి అంటూ విమర్శలు చేసారు. చివరికి నాలుగవ మ్యాచులో విజయం అందుకోవడంతో ఆమె మొఖంలో బాధ స్థానంలో నవ్వు కనిపించింది. ఆ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ముందు కూడా ఇలాగే గెలుస్తుందేమో చూడాలి.