ఐపీఎల్: లారాని ఇంప్రెస్ చేసిన ఆ ఆరుగురు.. సన్ రైజర్స్ నుండి ఇద్దరు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ప్లే ఆఫ్స్ కి చేరే వరకూ జరిగిన ఉత్కంఠ అందరికీ తెలిసిందే. ఐతే దుబాయ్ లో జరుగుతున్న ప్రస్తుత సీజన్లో ఆరుగురు ఇండియన్ ప్లేయర్లు మాజీ వెస్టిండీస్ ఆటగాడు బ్రియన్ లారాని ఇంప్రెస్ చేసారు. అందులో ఇద్దరు సన్ రైజర్స్ ఆటగాళ్ళుండడం విశేషం. మొదటగా సంజూ శాంసన్.. రాజస్తాన్ రాయల్స్ కి చెందిన సంజూ శాంసన్, మొదటి రెండు మ్యాచుల్లో 16సిక్సర్లు బాదాడు.

ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి చెందిన దేవ్ దత్ పడిక్కల్, పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సన్ రైజర్స్ కి చెందిన ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్. ఈ ఆరుగులు ఆటగాళ్ళు తమ అత్యుత్తమ ప్రదర్శనతో మాజీ క్రికెటర్ లారాని ఇంప్రెస్ చేసారట. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు బ్రియన్ లారా ని ఇంప్రెస్ చేసారంటే, ఈ ఆటగాళ్ళ సత్తా ఏంటో అర్థం చేసుకోవాల్సిందే.