కొత్త జెర్సీని ఆవిష్క‌రించిన పంజాబ్ కింగ్స్ టీమ్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

Join Our Community
follow manalokam on social media

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ ఎడిష‌న్‌కు స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ లీగ్ మ‌రో ఎడిష‌న్ ప్రారంభ‌మ‌వుతోంది. అందులో భాగంగానే ఆయా జ‌ట్ల‌కు చెందిన ఆట‌గాళ్లు ఇప్ప‌టికే టీమ్‌ల‌తో క‌లిసి రోజూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పంజాబ్ కింగ్స్ టీమ్ తాజాగా త‌మ జ‌ట్టుకు చెందిన ఆట‌గాళ్ల కొత్త జెర్సీని ఆవిష్క‌రించింది. కానీ ఆ జెర్సీ గురించి నెటిజ‌న్లు ఆ టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

netizen trolling punjab team for their new jersey

పంజాబ్ కింగ్స్ టీమ్ కొత్త‌గా ఆవిష్క‌రించిన త‌మ ప్లేయ‌ర్ల జెర్సీ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టు పాత జెర్సీని పోలి ఉంది. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. పంజాబ్ టీమ్‌కు జెర్సీని డిజైన్ చేసుకోవ‌డం కూడా చేత‌కాద‌ని, ఇక ఐపీఎల్‌లో ఏం ఆడ‌తారు ? అని మండిప‌డుతున్నారు. కాగా పంజాబ్ కింగ్స్ టీమ్ ఇటీవ‌లే త‌మ జ‌ట్టు పేరుతోపాటు లోగోను కూడా మార్చింది. కానీ కొత్త జెర్సీ ఆర్‌సీబీ జ‌ట్టు పాత జెర్సీని పోలి ఉండ‌డంతో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

కాగా పంజాబ్ కింగ్స్ టీమ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా గ‌త సీజ‌న్‌లో పంజాబ్ జ‌ట్టు అంత‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో ఈసారి వేలంలో భారీ ధ‌ర‌ల‌కు ప‌లువురు ప్ర‌ముఖ ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ జ‌ట్టు ఏప్రిల్ 12న వాంఖెడె స్టేడియంలో రాజ‌స్థాన్‌తో తొలి మ్యాచ్‌ను ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో ఆ టీమ్ ఈసారి ఎలా ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...