43పరుగుల దూరంలో రోహిత్.. చెన్నై నెత్తినెక్కుతాడు..

-

ఐపీఎల్ టోర్నమెంట్ లో చెన్నై సూపర్ సింగ్స్ పై పరుగులు సాధించడం అంటే అంత తేలిక కాదు. ధోనీ సారథ్యం వహిస్తున్న ఈ టీమ్ బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంటుంది. అందువల్ల ఏ బ్యాట్స్ మెన్ కూడా ఎక్కువ పరుగులు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు చెన్నైపై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుకెక్కాడు. 747పరుగులతో చెన్నైపై ఎక్కువ పరుగులు చేసిన ఘనట కోహ్లీకే దక్కింది.

రెండవ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. 707పరుగులు చేసి ఆ స్థానాన్ని అందుకున్నాడు. ఐతే రేపు ఐపీఎల్ 13వ సీజన్ మొదలు కాబోతుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అందువల్ల కోహ్లీని వెనక్కి నెట్టి చెన్నైపై ఎక్కువ పరుగులు తీసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి రోహిత్ కి మంచి అవకాశం. ఇంకా 43పరుగులు సాధిస్తే చెన్నై నెత్తినెక్కి కూర్చుంటాడు. మరి రేపటి మ్యాచ్ లో రోహిత్ ఆట ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news