ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచులకి రోహిత్ ని దూరం పెట్టిన బీసీసీఐ..

ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత ఇండియా క్రికెట్ టీమ్, ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆసీస్ టూర్ కి ఆటగాళ్ళని సెలెక్ట్ చేసే పనిలో పడింది. ఐతే ఈ ఎంపికలో రోహిత్ ని కేవలం టెస్టులకి మాత్రమే ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ, గాయం కారణంగా కొన్ని మ్యాచులకి దూరం అయ్యాడు.

అదీగాక మరికొన్ని రోజులు రోహిత్ రెస్ట్ తీసుకోవడం తప్పని సరి అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ కారణంగా వన్డే మ్యాచులకి, టీ ట్వంటీ మ్యాచులకి రోహిత్ ని పక్కన పెట్టారు. టెస్టు సిరీస్ కి రోహిత్ ఆడతాడని, అప్పటి వరకూ అతడు గాయం నుండి కోలుకుంటాడని బీసీసీఐ తెలిపింది. అదే విధంగా అటు కెప్టెన్ కోహ్లీ, వన్డే మ్యాచులతో పాటు టీ ట్వంటీ సిరీస్ తర్వాత ఒక టెస్టుకి మాత్రమే ఆడతాడట. ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చేస్తాడని తెలిపింది.