ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 2020ని అందుకే గెలుచుకుంది: షేన్ వాట్సన్

-

మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయ‌ర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు షేన్ వాట్సాన్ ఇటీవ‌లే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2020లో చెన్నై వైఫ‌ల్యం అనంత‌రం వాట్సన్ ఆ నిర్ణ‌యం తీసున్నాడు. అయితే ఐపీఎల్ 2020ని రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని ముంబై జ‌ట్టు ఎందుకు గెలుచుకుందో వాట్స‌న్ చెప్పాడు.

shane watson told why mumbai won ipl 2020

ముంబై ఇండియ్స్ 5వ ఐపీఎల్ టైటిల్ ను సాధించినందుకు కంగ్రాట్స్. ఐపీఎల్ 2020లో మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ చాలా స్ట్రాంగ్ టీంగా ఉంది. ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్లు ఎలాంటి బ‌ల‌హీన‌త‌లు చూపించ‌కుండా ఆడారు. చ‌క్క‌ని ప్ర‌దర్శ‌న ఇచ్చారు. రోహిత్ శ‌ర్మ‌, క్వింట‌న్ డికాక్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌, పాండ్యా సోద‌రులు, కిర‌న్ పొల్లార్డ్‌లు ఆద్యంతం చ‌క్క‌గా ఆడారు. అందువ‌ల్లే ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 2020ని గెలుచుకుంది.. అని వాట్స‌న్ అన్నాడు.

అయితే భ‌విష్య‌త్తులో జ‌రిగే మ‌రిన్ని సీజ‌న్ల‌లోనూ ముంబై ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేస్తుంద‌ని వాట్స‌న్ అభిప్రాయ‌పడ్డాడు. కాగా ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే చెన్నై ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి ప్లే ఆఫ్స్ కు కూడా రాలేదు. పాయింట్ల ప‌ట్టిక‌లోనూ చివ‌రి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈసారి అత్యంత పేల‌వంగా చెన్నై ఆడింది. అయితే వ‌చ్చే సీజ‌న్‌లో చెన్నై పుంజుకుంటుందో, లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news