ఐపిఎల్ కు ముందే స్టార్ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్…!

రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ లో అన్ని జట్లకు అతిపెద్ద సవాలు యుఎఈలో ప్రస్తుతం ఉన్న వేడి మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితి అని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఎబి డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఎక్కువ మ్యాచ్ లు రాత్రి సమయంలో ఆడతారని కాబట్టి పరిస్థితి ఇంకా సవాల్ గా ఉంటుందని చెప్పాడు. నిజాయితీగా చెప్పాలి అంటే నేను ఈ రకమైన పరిస్థితులకు నిజంగా అలవాటు పడలేదన్నాడు.

ఇక్కడ చాలా వేడిగా ఉందని చెప్పాడు. జూలైలో చెన్నైలో మేము ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ నాకు గుర్తు చేస్తుందన్నాడు. తేమ రాత్రి 10 గంటలకు కూడా సమానంగా ఉంటుంది. నేను ఇక్కడకు వచ్చినప్పుడు కొన్ని నెలల వాతావరణ పరిస్థితులను గమనించా అని అన్నాడు. వాతావరణ పరిస్థితులు కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాయని అన్నాడు. చివరి 5 ఓవర్లకు మీ శక్తిని పెంచుకోవాలని అన్నాడు.