సన్ రైజర్స్ కి వరుసగా రెండవ ఓటమి..

-

సన్ రైజర్స్ పెట్టిన 143 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ చాలా సునాయాసంగా అందుకుంది. శుభ్ మన్ గిల్ అద్భుతమైన పర్ ఫార్మెన్స్ కి ఇయాన్ మోర్గాన్ తోడవడంతో, నైట్ రైడర్స్ 18 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 145పరుగులు చేయగలిగింది. ఏడు వికెట్ల తేడాతో సునాయాసంగా విజయతీరాలకి చేరుకుంది. దీంతో ఈ సీజన్లో నైట్ రైడర్స్ మొదటి విజయం అందుకోగా, సన్ రైజర్స్ కి వరుసగా రెండవ ఓటమి వచ్చింది.

స్కోరు వివరాల్లోకెళితే, ఓపెనర్ గా వచ్చిన శుభ్ మన్ గిల్ 62బంతుల్లో 5ఫోర్లు, రెండు సిక్సర్లతో 70పరుగులు చేసాడు. సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ డకౌట్ అయ్యారు. నితేష్ రానా 26పరుగులు చేసాడు. 29బంతులాడిన ఇయాన్ మోర్గాన్, 3ఫోర్లు, 2సిక్సర్లతో 42పరుగులు చేసి శుభ్ మన్ గిల్ కి మంచి భాగస్వామ్యం అందించి జట్టుని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మెద్, నటరాజన్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news