ఐపీఎల్: 7భాషల్లో 9ఎమోజీలని లాంఛ్ చేసిన ట్విట్టర్..

-

ఈసారి ఐపీఎల్ సీజన్ సందడంతా సోషల్ మీడియాలోనే జరగనుంది. కరోనా కారణంగా దుబాయ్ లో జరుగుతున్న టోర్నమెంట్ చూసే అవకాశం లేదు. అందువల్ల టీవీల్లో మ్యాచులు చూసి సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ముందుగానే సిద్ధం అవుతున్నాయి. చర్చ పెట్టుకోవడానికి తమ వంతు సహకారంగా అన్నింటినీ అందుబాటులో ఉంచుతున్నాయి.

ఈ మేరకు ట్విట్టర్ తొమ్మిది ఎమోజీలని విడుదల చేసింది. ఏడు భాషల్లో ఒక్కో జట్టుకి ఒక్కో భాషగా, మొత్తం తొమ్మిది ఎమోజీలని విడుదల చేసింది. ఈ ఎమోజీలని ఆక్టివేట్ చేయడానికి ప్రత్యేకమైన హ్యాష్ ట్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని OneFamily, #WhistlePodu, #PlayBold, #KorboLorboJeetbo, #SaddaPunjab, #OrangeArmy, #HallaBol ఇంకా #YehHaiNayiDilli. సెప్టెంబర్ 19వ తేదీ నుండి ఐపీఎల్ టోర్నమెంట్ మొదలవుతుంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news