అర్సీబీకి షాక్.. ఐపీఎల్‌ నుంచి ఇద్దరు విదేశీ ఆటగాళ్ళు ఔట్

-

ఐపీఎల్‌ మధ్య దశకు చేరుకుంటున్న సమయంలో క్రమంగా ఆటగాళ్ళు వివిధ కారణాల నుంచి టోర్నీకి దూరమవుతున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇద్దరు విదేశీ ఆటగాళ్ళు దూరమయ్యారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ లు ఐపీఎల్‌ నుంచి తప్పుకొని స్వదేశాని పయనమయ్యారు. ఈ విషయాన్ని మేరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

వ్యక్తిగత కారణాల వల్ల రిచర్డ్సన్, జంపాలు ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్లు అర్సీబీ వెల్లడించింది. మిగిలిన మ్యాచ్ లకు ఈ ఇద్దరు ఆటగాళ్ళు అందుబాటులో ఉండరని తెలిపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం వారి నిర్ణయాన్ని గౌరవిస్తుందని అలానే వారికి పూర్తి మద్దతుగా ఉంటుందని పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. తన కుటుంబ సభ్యులు కరోనాతో పోరాడుతున్నారని… ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సి ఉందని అందుకే ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. అయితే పరిస్థితులు చక్కబడితే తిరిగి ఐపీఎల్‌కు తిరిగి వస్తానని అశ్విన్ పేర్కొన్నాడు.

కాగా ఈ ఐపీఎల్‌ సీజన్ లో నాలుగు వరుస విజయాలతో మంచి జోరు మీదున్న అర్సీబీకి ఆదివారం ధోని సేన షాక్ ఇచ్చింది. అర్సీబీ వరుస విజయాలకు చెక్ పెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక బెంగళూరు తన తరువాత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news