ఐపీఎల్.. మొదటి మ్యాచులో ఎవరు గెలుస్తారు.. గంగూలీ ఏమన్నాడంటే..

మరికొద్ది సేపట్లో ఐపీఎల్ మ్యాచ్ మొదలు కాబోతుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటాపోతీగా తలపడబోతున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అరునెలలుగా ఆటకి దూరమైన ఆటగాళ్ళు స్టేడియంలో కనిపించబోతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో విజేతగా ఎవరు గెలుస్తారని అందరూ ఆలోచిస్తున్నారు. ఒక పక్క ముంబై ఇండియన్స్ అభిమానులేమో తమ టీంఏ గెలుస్తుందని, ఇటు చెన్నై అభిమానులు, వాళ్లే గెలుస్తారని అనుకుంటున్నారు.

ఈ ప్రశ్నని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. రెండు జట్లలో ఏది గెలుస్తుందనంటే పక్కాగా చెప్పలేం. ఇరు జట్లకి బలాబలాలు సమంగా ఉన్నాయి. కాకపోతే ముంబై ఇండియన్స్ టీమ్, చెన్నై ని గత సీజన్లలో నాలుగు సార్లు ఓడించింది. అదీగాక ఇప్పటి వరకు నాలుగు సార్లు ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది. ఐతే అటు పక్క ధోనీ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ధోనీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పలేమని బదులిచ్చాడు.